ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్ తన తదుపరి ఉత్పత్తుల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 13న జరగనున్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన టీజర్ వీడియోను కంపెనీ వరల్డ్‌వైడ్ మార్కెటింగ్ ఎస్‌వీపీ గ్రెగ్ జోస్వియాక్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘Welcome Home’ అనే పేరుతో విడుదలైన ఈ వీడియోతో, యాపిల్ కొత్త హోమ్ డివైజ్‌లను ఆవిష్కరించబోతుందని అంచనా, యాపిల్ టీవీ 4K, హోమ్‌పాడ్ మినీ 2 మరియు కొత్త స్మార్ట్ హోమ్ హబ్ వంటి ఉత్పత్తులను విడుదల చేయనుందని సమాచారం.