ఈసీఐఎల్ రిటైర్డ్ ఉద్యోగి(66)ని ఫేస్‌బుక్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి న్యూడ్ వీడియో కాల్ చేశాడు. దీనికి బాధితుడు స్పందించాడు.న్యూడ్ వీడియో కాల్‌ను రికార్డు చేసిన కేటుగాళ్లు దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తామని యూట్యూబ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కూడా వీడియోను పోస్ట్ చేశామని, వాటి నుంచి తొలగించాలంటే రూ.30లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సైబర్ కేటుగాళ్లు బెదిరింపులకు గురిచేసి సుమారు రూ.20లక్షలను కాజేశారు. మరిన్ని లక్షలు కాజేసేందుకు స్కెచ్ వేయగా
పోలీసులు అప్రమత్తమై అడ్డుకునడంతో భారీ మోసం తప్పినట్లయింది.