తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలవడనున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్ పార్టీ టివికె తరుఫున పోటీ చేసిన పి. సత్యభామ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఐఏడీఎంకే అభ్యర్థి పి. సత్యభామ.. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికార టివికెలో చేరారు.