<span;>తెలంగాణలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం, జలాశయాలు నిండకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలమట్టాలు 7.52 మీటర్ల లోతుకు పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతేడాదితో పోలిస్తే 3.11 మీటర్ల మేర నీటిమట్టాలు తగ్గాయి. , 7 జిల్లాల్లో సగటు భూగర్భ జలమట్టం 10 నుంచి 15 మీటర్లకు, 19 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్లకు, మిగతా 7 జిల్లాల్లో 5 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది.