తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 18 వరకు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. శనివారం నాడు ‘ఎంగిలి పూల బతుకమ్మ’తో ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ సంబరాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 10 కోట్లను మంజూరు చేసింది. పండుగను సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.