ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన తరగతుల (బీసీ) గొంతును మరింత బలంగా వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 16న విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. వెనుకబడిన వర్గాల గర్జన సభ ద్వారా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకునే అవకాశం ఉంది. నిక సంస్థలు మరియు ఇతర రంగాల్లో రిజర్వేషన్ల అంశంలో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం బీసీ వర్గాలను తీవ్రంగా మోసం చేస్తోందని ఆరోపించింది.