రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై.రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ను విడుదల చేసింది. బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో విజయ్ ఓ శక్తిమంతమైన యోధుడి పాత్రలో అలరించనున్నారు.