సౌదీ అరేబియా లక్ష్యంగా హూతీ రెబల్స్ దాడులకు పాల్పడుతున్న వేళ ఇండిగో, ఎయిరిండియా విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమనాశ్రయంపై దాడి నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీ వరకు ఆ నగరానికి విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ పూర్తి రిఫండ్ చెల్లించనున్నట్లు తెలిపాయి. దీనివల్ల ప్రభావితమైన ప్రయాణికులకు ఉచితంగా రీషెడ్యూల్ చేసుకొనే అవకాశం కల్పించాం అని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ అధికార ప్రతినిధి తెలిపారు.