రాజస్థాన్లోని అజ్మీర్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా ఖైదీలను నిబంధనలకు విరుద్ధంగా జైలు నుంచి బయటకు తీసుకెళ్లి తన ఇంట్లో పనులు చేయించిన కేసులో అప్పటి మహిళా జైలర్ దివ్య చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆమెను అజ్మీర్ పోలీసుల సైబర్ సెల్ సాంకేతిక ఆధారాలతో కోటాలో గుర్తించి అదుపులోకి తీసుకుంది. దీంతో ఒకప్పుడు జైలర్గా పనిచేసిన అదే అజ్మీర్ సెంట్రల్ జైలుకు ఇప్పుడు ఖైదీగా దివ్య చౌదరి చేరడం చర్చనీయాంశంగా మారింది.