దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. పండుగ సందర్భంగా 7వేల ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచేలా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్లాన్ చేసింది. కరీంనగర్ జోన్ నుంచి మొత్తం 3533 బస్సులు.. హైదరాబాద్ జోన్ నుంచి 2,155 బస్సులు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1,312 ప్రత్యేక సర్వీసులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.