ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. అప్పుడప్పుడు ఏదో ఒక విషయం బయటకు వస్తూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్ దృశ్యాలు యాపిల్ మ్యాప్స్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సెట్‌ను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా కొందరు నెటిజన్లు సినిమా లొకేషన్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. యాపిల్ మ్యాప్స్‌లో కనిపించిన సెట్ దృశ్యాలను వీడియోగా రూపొందించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.