తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో శతాబ్దాల నాటి అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చివేయించింది. ఈ మహాపచారంపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక ఆలయాలను కూల్చివేస్తోంది. చంద్రబాబు.. ఆలయాలను కూల్చివేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు?. సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా చంద్రబాబూ..?. హే రామ్! ఆలయాలను రక్షించండి.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి’ అంటూ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

