రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఫ్రాన్స్ కు చెందిన హెన్రీ కగాన్, జపాన్ కు చెందిన కెన్సో సొవాట్లు ఈ పురస్కారం అందుకోనున్నారు. అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్లో నానీనియర్ ప్రభావాలు, ఆటోకాటలిసిస్ ఆవిష్కరణలకు గాను నోబెల్ కు వీరిని ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. రసాయన శాస్త్రంలో 1901 నుంచి 2025 వరకు 117 సార్లు నోబెల్ ను ప్రకటించగా.. 198 మంది దీనిని అందుకున్నారు.

