సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఈసీ కార్యాలయం వద్ద విపక్ష ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. దీంతో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బారికేడ్లు అడ్డంపెట్టి విపక్ష ఎంపీలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, రాహుల్ గాంధీ బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపారు. నినాదాలు చేస్తున్న ఎంపీలను పోలీసులు అరెస్టు చేసి బస్సులో తరలిస్తున్నారు.