ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వకుండానే తన పాస్ పోర్ట్ సీజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈనాడు దినపత్రిక తప్పుడు వార్తలు ప్రచురించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారులు పాస్ పోర్ట్ రక్షణ కొరకు కేవలం ఒక అర్జీని మాత్రమే దాఖలు చేయగా, కోర్టు ఆదేశాలిచ్చినట్లు అసత్యపు కథనాలు రాయడంపై ఆయన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. తమపై అసత్య ప్రచారం చేసినందుకు గాను సదరు యాజమాన్యం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.