షేక్పేట ప్రాంతంలో ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో ఉంటున్న బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కల్పన (18) ఫ్యానుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచింది. మృతురాలు మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం పేరూరు గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. హాస్టల్లో పెట్టే భోజనం నాసిరకంగా ఉండటంతో నిర్వాహకులను ప్రశ్నించిందని, హాస్టల్ నిర్వాహకుల నిందలు, మానసిక వేధింపులు తాళలేకే తన కుమార్తె తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.