ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, భద్రతా అవసరాలు మరియు పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు (GOs) జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన ఈ నాలుగు కమిషనరేట్లకు ఐజీ (IGP) లేదా డీఐజీ (DIGP) స్థాయి
సీనియర్ ఐపీఎస్ అధికారులు పోలీస్ కమిషనర్లుగా వ్యవహరిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో కేవలం విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మాత్రమే కమిషనరేట్ వ్యవస్థ అందుబాటులో ఉంది.

