ప్లై దుబాయ్ విమాన ఘటనలో దాడికి పాల్పడ్డ కోపైలట్ హమామ్ అల్-హమ్మామీ అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అతడు విమానాన్ని కూల్చివేయడానికి యత్నించానని అంగీకరించినట్లు సమాచారం. ఆ సమయంలో చావుకు కూడా భయపడలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోపైలట్ ఉగ్రవాద చర్యకు ప్రయత్నించాడని యూఏఈ అటార్నీ జనరల్ తెలిపారు. హమ్మామీ దాడి ఘటనలో బయటి శక్తుల ప్రమేయం ఉందా అనే అంశంపై సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ దర్యాప్తు చేస్తున్నాయి.