గణేశ్ నిమజ్జనం పూర్తయ్యింది..జ్ఞానేశ్ నిమజ్జనం ఉందని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు ఉండాల్సిన వ్యవస్థ మనదని అన్నారు. 2025 ఫిబ్రవరిలో ఓటర్ల జాబితా ప్రకటించి వెంటనే ఎస్ఐఆర్ ఎందుకు చేపట్టారు? ప్రభుత్వమే జారీ చేసిన ఆధార్ కార్డు ఓటుకు ఎందుకు ప్రామాణికం కాదు? అని ప్రశ్నించారు. పశ్చిమ్ బెంగాల్ లో అర్హుల ఓట్లు తొలగించి ప్రభుత్వాన్ని మార్చారని, బతికే ఉంటే ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారని ధ్వజమెత్తారు.