వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి ఘాట్రోడ్డులో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో 51 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి చనిపోగా, మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. గాయపడిన 50 మందిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్సులు, ఇతర వాహనాల ద్వారా చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.