మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ధమన్‌గావ్ రైల్వే సమీపంలో సమృద్ధి హైవేపై శుక్రవారం తెల్లవారుజామున
ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షేగావ్ నుంచి వార్దాకు దుర్గామాత విగ్రహాన్ని టెంపో పికప్ వాహనంలో తరలిస్తుండగా..వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ట్రక్కు డ్రైవర్ అదుపుతప్పి ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొక 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన 18 మందిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.