డీబీఆర్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్ నిర్మాణ పనులు జరుగుతుండగా భారీ క్రేన్ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు ఒరిగి లోతులో పడిపోయింది.ఈ ప్రమాదంలో క్రేన్ కింద ముగ్గురు కార్మికులు చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.దీంతో ఒక్కసారిగా నిర్మాణ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.