దేశవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది.ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU)ఆదివారం రాత్రి జరిపిన చర్చలు విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బ్యాంకు ఖాతాదారులు,వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులన్నీ ఎప్పుడూ లాగే యథావిధిగా పనిచేయనున్నట్లు యూనియన్ స్పష్టం చేసింది.