చెస్ ఒలింపియాడ్లో భారత జట్లు పతకాలను
సాధించాయి. పురుషుల జట్టు రజతం అందుకోగా.. మహిళా టీమ్ కాంస్యం సొంతం
చేసుకుంది. దీంతో 2026 ఒలింపియాడ్లో రెండు విభాగాల్లోనూ పోడియం ఎక్కిన ఏకైక దేశం భారత్ కావడం గమనార్హం. చివరి రౌండ్లో హంగేరీతో భారత పురుషుల జట్టు తలపడింది. అయితే, డ్రా చేసుకోవడంతో రెండో స్థానానికే పరిమితమైంది. మహిళల జట్టు తన చివరి రౌండ్లో జార్జియాతో డ్రా చేసుకుంది. మెరుగైన టై బ్రేక్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది.