ఢిల్లీలో ప్రజా పనుల విభాగం మంత్రి, బీజేపీ నేత పర్వేశ్ వర్మ ఆదివారం తిలక్ నగర్‌లో రోడ్డు నిర్మాణ పనులను తనిఖీ చేస్తుండగా తీవ్ర వివాదం చెలరేగింది. కొత్తగా వేసిన రోడ్డు నాణ్యతను పరిశీలిస్తున్న సమయంలో సహనం కోల్పోయిన మంత్రి యువకుడి మొబైల్ ఫోన్‌ను కిందకు లాగి, చెంపపై కొట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.తాను కొట్టిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త అని, తన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించడం వల్లే ఆగ్రహం కట్టలు తెంచుకుందని మంత్రి వివరణ ఇచ్చారు.