గుల్వీర్ సూపర్ షో.. 1500మీ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్
అథ్లెటిక్స్‌లో గుల్వీర్ సింగ్ మళ్లీ మెరిశాడు. ఏషియన్ గేమ్స్‌లో రెండో పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇవాళ జరిగిన 1500 మీటర్ల ఫైనల్‌లో అతను రెండో స్థానంలో నిలిచి సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇదే గేమ్స్‌లో అతను 10000 మీటర్ల ఈవెంట్‌లోనూ రజత పతకాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ 1500 మీటర్స్ ఈవెంట్‌ను అతను కేవలం 3:36.72 నిమిషాల్లో ఫినిష్ చేశాడు.

