హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు.తొండుపల్లి టోల్‌ప్లాజా దగ్గర డ్రైవర్ రూట్ మార్చాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.ఆమె ప్రతిఘటించడంతో రూ.60 వేల నగదుతో అతడు పారిపోయాడు. స్థానికుల సహాయంతో బాధితురాలి పిఎస్ చేరుకొని ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

