వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాట్‌తో మరో ప్రత్యేక అధ్యాయాన్ని రాశాడు. గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 96 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి వన్డే కెరీర్‌లో 10వ శతకాన్ని నమోదు చేశాడు. క్లాసిక్ స్ట్రెయిట్ డ్రైవ్‌తో మూడు అంకెల స్కోరును అందుకున్నాడు. ఈ ఘనత కోసం గిల్‌కు 67 ఇన్నింగ్స్ మాత్రమే అవసరమయ్యాయి. దీంతో 10 వన్డే సెంచరీలు వేగంగా సాధించిన ఆటగాళ్ల ప్రపంచ జాబితాలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డి కాక్ , హషీమ్ ఆమ్లా తరువాతి స్థానంలో నిలిచాడు.