ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. పురుషుల మారథాన్లో రజత పతకం సాధించి.. ఈ విభాగంలో భారత్ 44 ఏండ్ల నిరీక్షణకు తెరదించాడు. జపాన్లోని నాగోయాలో శనివారం జరిగిన ఫైనల్లో బర్వాల్ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. దీంతో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో పాటు కొత్త జాతీయ రికార్డును నమోదు చేశాడు. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో పతకం సాధించింది. అప్పట్లో హోసూర్ కుక్కప్ప సీతారామ కాంస్య పతకం గెలిచారు.

