ఐఐటీ బాంబేలో చదువుతూ మరణించిన విద్యార్థి సాహిల్ వాకోడే తల్లిదండ్రులకు అన్ని విధాలా అండగా ఉంటామని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సాహిల్ పేరెంట్స్ రవీంద్ర, సోనాలి వాకోడేలకు రాహుల్ గాంధీ వీడియో కాల్ మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయ. ఈ సందర్భంగా తమ కుమారుడికి న్యాయం కోసం వారు చేస్తున్న పోరాటంలో అండగా ఉంటామని, సాధ్యమైనంత సహాయం చేస్తామని రాహుల్ గాంధీ సాహిల్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారని పేర్కొన్నాయి.