ఆసియా క్రీడల్లో భారత్ కు మరో రజతం దక్కింది. వుషూలో భారత్ క్రీడాకారిణి రోషిబినా దేవీ రజత పతకం కైవసం చేసుకొంది. మహిళల 60 కేజీల సాండా విభాగంలో ఫైనల్లో చైనా క్రీడాకారిణి జియావోయూ జాంగ్ తో తలపడి 0-2 తేడాతో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకొంది. అలాగే రోయింగ్ లో భారత్ కు కాంస్యం దక్కింది.