గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ తో భేటీ అయ్యారు. డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్ తో భేటీ అనంతరం వైఎస్ జగన్ లోక భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. సెప్టెంబరు 21న జరిగిన ఘటనపైనే కాకుండా, ఏ విధంగా డీఎస్సీ స్కామ్ యువత నష్టపోయింది అనేది వివరించాము. ఈ వ్యవస్థ మీద ప్రజలకు మళ్లీ నమ్మకం రావాలన్నా, ఈ వ్యవస్థలో లోపాలు సవరించాలన్నా డీఎస్సీ స్కామ్ పై సీబీఐ విచారణ జరగాలి. విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి.

