పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ లోతైన వాయుగుండం గత ఆరు గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. విశాఖపట్నానికి 140 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

