విజయవాడలో సంచలనం రేపిన రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ మృతి చెందిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం కేసు విచారణను తామే చేపడతామని స్పష్టం చేసింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో హైకోర్టు విచారణపై స్టే విధించింది. తదుపరి విచారణ ప్రక్రియను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.