దేశవ్యాప్తంగా బ్యాంక్ ఖాతాదారులకు కీలక సమాచారం అందింది. సాధారణంగా ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే సెప్టెంబర్ 27, 2026 ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) సాధారణంగా పనిచేయనున్నాయి. ప్రతిపాదిత మూడు రోజుల బ్యాంకు సమ్మె కారణంగా ఖాతాదారులకు వరుసగా ఎక్కువ రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ కూడా బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ATM-లింక్డ్ బ్రాంచ్లు, కరెన్సీ చెస్ట్లను ఆ రోజు తెరవడానికి అనుమతించింది.