కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తెలంగాణ ప్రభుత్వం చర్చలు ఫలించాయి. నీటి విడుదలకు కర్ణాటక సీఎం అంగీకరించారు. తెలంగాణకు కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరగా అందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. కొందరు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కర్ణాటక సీఎంతో బుధవారం ఉదయం భేటీ అయ్యారు. మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, మేఘారెడ్డి, ముధుసూదన్‌రెడ్డి కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో భేటీ సందర్భంగా నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.