శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన.. దాడుల వ్యవహారం పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన వైసీపీ ముఖ్యులతో సహా మొత్తంగా 51 మంది పైన రౌడీ షీట్ ఓపెన్ చేసేందుకు ఉన్నతాధికారులు ఆదేశించారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ సహా 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని సీపీ రాజశేఖర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.