కూటమి ప్రభుత్వంలో అంతా కలిసికట్టుగా పనిచేయాలని, అదే సమయంలో ఎవరి గౌవరం తగ్గకూడదని.. జనసేన పార్టీ గౌరవానికి భంగం వాటిల్లకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు కృతజ్ఞత చూపించేతత్వం చాలా ఎక్కువని, అది తన స్వభావం అన్నారు. వచ్చే 3, 4 నెలల్లో క్యాంప్ ఆఫీసు పిఠాపురానికి మార్చుతానని, జనసేన నాయకులందరికీ దిశా నిర్దేశం చేయాలన్నారు. పదవులు తీసుకున్న తరువాత మన నాయకులంతా మెత్తపడ్డారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.