ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ ఫైనల్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. నిషిన్లోని కోరోగీ స్పోర్ట్స్ పార్క్లో శ్రీలంకతో జరిగిన స్వర్ణ పతక ఫైనల్ పోరులో పోరులో టీమిండియా విజయం సాధించింది. శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 147 పరుగుల భారీ తేడాతో గెలిచిన హర్మన్ ప్రీత్ సేన 2022 తర్వాత మరోసారి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు కేవలం 15.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 69 పరుగులకే ఆలౌట్ అయింది.