ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పట్టించుకోని ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు ఎందుకని కాక్రోచ్ పార్టీ నేతలు ప్రశ్నించారు. ఆదివారం ఎంజీఎం ఆరోగ్యశ్రీ వార్డులో స్లాబ్ పెచ్చులూడి పేషెంట్లు, సిబ్బంది గాయపడిన నేపథ్యంలో సోమవారం వారు ఆస్పత్రిని సందర్శించారు. వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా, సంచాలకులు డాక్టర్ వాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆస్పత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. ఆఫీసర్లను కలిసేందుకు ప్రయత్నించిన తమను పోలీసులు అడ్డుకున్నారని నేతలు ఆరోపించారు. ఎంజీఎం సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శించారు.