ఆదిలాబాద్ రిమ్స్‌లోని స్పెషల్ కేర్ నియోనాటల్ యూనిట్లో షార్ట్‌సర్క్యూట్‌తో ఏసీ పేలింది. ఈ ప్రమాదంలో ఓ నవజాత శిశువు స్పాట్లోనే చనిపోగా, మరొక చిన్నారి ప్రైవేట్ ఆస్పత్రికి తలిస్తుండగా చనిపోయినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో NICU వార్డులో 27మంది చిన్నారులున్నారు. పలువురు చిన్నారులకు గాయాలు కాగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన చిన్నారులకు 4 ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.