అమెరికా విమానాశ్రయాల్లో ఎయిర్ ట్రాఫిక్ సెంటర్లో సాంకేతిక సమస్యల వల్ల యూఎస్ ఈశాన్య ప్రాంత విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి విదేశీ నాయకులు విమానాల్లో వస్తున్న తరుణంలో, ఎయిర్ ట్రాఫిక్ కు కమ్యూనికేషన్ వైరు తెగిపోవడంతో సోమవారం వందలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో న్యూయార్క్ నగర ప్రాంతంలోని ప్రతి ప్రధాన విమానాశ్రయంలో కార్యకలాపాలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన అధికారులు గంటలకొద్దీ శ్రమించి కనెక్షను పునరుద్ధరించడంతో యథావిధిగా విమానాలు రాకపోకలు సాగాయి.