పశ్చిమమధ్య, ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారానికి (సెప్టెంబర్ 22న) వాయుగుండంగా బలపడి, 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు.రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.