సంచలనం సృష్టించిన అయోధ్యలోని రామమందిర్ విరాళాల చోరీ కేసు సుప్రీంకోర్టులో సోమవారంనాడు విచారణకు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు పురోగతిపై స్థితిగతుల నివేదికను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన అధికారులు కేసులో నిందితులందరినీ గుర్తించారని, దర్యాప్తు దాదాపు పూర్తయిందని, సెప్టెంబర్ 25వ తేదీ లోగా ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ‘సిట్’ కోర్టుకు తెలిపింది.