కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామంలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేనులో వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో ఇద్దరు మహిళా రైతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. పొలంలోనే ఉన్న సమయంలో ఉన్నట్టుండి భారీ శబ్దంతో వారిపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు మహిళలు అక్కడికక్కడే కన్నుమూసారు.