హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలను నిమజ్జనం చేయకూడదంటూ అధికారులు విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఉత్సవ సమితి నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరగడంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఖండిస్తోంది. ట్యాంక్‌బండ్ అనేది దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ నిమజ్జన ప్రాంతమని, అక్కడే కార్యక్రమానికి అనుమతించాలని పట్టుబడుతోంది.