దిగువ సభకు (స్టేట్ డుమా) జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు పుతిన్ సారథ్యంలోని యునైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం సాధించింది. చెప్పుకోదగిన ప్రతిపక్ష పార్టీలు లేకపోవడంతో పుతిన్ పార్టీ విజయం నల్లేరుమీద నడకలా మారింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యాలో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. రష్యా మీడియా కథనాల ప్రకారం, ఇప్పటివరకూ 90 శాతం ఓట్ల కౌంటింగ్ పూర్తైంది. మొత్తం సీట్లలో యునైటెడ్ రష్యాకు 355 సీట్లు లభించగా కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ రష్యాకు 40 సీట్లు లభించాయి.