యూనివర్సిటీల్లో రాజకీయ సిద్ధాంతాల ప్రభావంపై అభిజీత్ దీప్కే మాట్లాడారు.హిందీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ కుముద్ శర్మకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. ఆమె వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 50 మందికి పైగా విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సమస్యలపై ఆందోళన చేస్తే కేసులు నమోదవుతున్నాయని, మరోవైపు ABVP ఏదైనా నిరసన చేపట్టినా లేదా గేట్లకు తాళాలు వేసినా కేసులు పెట్టడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా దళిత, ఆదివాసీ విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారని ఆయన అన్నారు.