ఓ మహిళా ఎంటర్ప్రెన్యూర్ ఏకంగా సీఎం సన్నిహితుడి నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించి తన ఎక్స్ ఖాతా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం తాను న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, సీఎంకు సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్కు రావాలని పిలిచాడంటూ కె.శోభా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎవరి పేర్లు చెప్పలేను కానీ ఇలాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ ట్వీట్లో పేర్కొంది.