బాలీవుడ్ స్టార్, బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ మరోసారి తన ఫిట్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే నటీనటుల శారీరక మార్పులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వారిపైనా మండిపడ్డారు. వారికి అదిరిపోయేలా ఇచ్చారు సల్మాన్. సల్మాన్ ఖాన్ తన టోపీ, జాకెట్‌ను తొలగించారు. ఆ తర్వాత బ్లాక్ టీషర్ట్‌ను కూడా విప్పి తన టోన్డ్ ఫిజిక్‌ను చూపించారు. 60 ఏళ్ల వయసులోనూ సల్మాన్ ఖాన్ మెయింటైన్ చేస్తున్న ఫిట్‌నెస్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.